Pt. shriram Sharma Acharya
వేదమూర్తి, తపోనిష్ఠ, యుగద్రష్ఠ పండిత శ్రీరామ శర్మ ఆచార్యులు గొప్ప తపోసంపన్నులేకాక సంఘ సంస్కర్త స్వాత్రంత్ర సమర సేనాని కూడా. వారు యుగనిర్మాణయోజన ద్వారా సమస్త మానవజాతిని దైవత్వమువైపు నడిపించటానికి ఒక బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టి విశాలమైన ఒకే కుటుంబము గాయత్రీ పరివార్ ద్వారా దానిని విశ్వవ్యాప్తిగావించారు. ఆయన తమ జీవితాన్ని ఒక పధ్ధతిప్రకారము నియమాచరణప్రకారము జీవించటమేకాక అనేకమార్లు హిమాలయాలలో తపస్సు చేసి సిధ్ధపురుషులయ్యారు.
ఆయన అతి సునాయాసముగా సంపూర్ణ వేద వాంజ్ఞమయాలను సంస్కృతము నుండి హిందీలోకి అనువదించారు, అంతేకాక అనేక అధ్యాత్మిక, సాఘింక విషయములపై 3000 పైగా పుస్తకాలను రచించారు.
1938 లో అఖండజ్యోతి అను మాసపత్రికను మొదలుపెట్టారు, మొదట హిందీలో మొదలుపెట్టిన ఈ మాసపత్రిక ఇప్పుడు ఇంగ్లీషులోనేకాక 30కి పైగా స్థానిక భాషలలో అనువదింపబడి ప్రతి నెల అనేక లక్షల పత్రికలు ప్రజలకు అందుతున్నాయి. ఈ పుస్తకముల ద్వారా విచారక్రాంతి అనగా – “ఆలోచనలలో ఉన్నతమైన మార్పులు, అతి ఉత్తమ నడవడి, మూఢాచారలను కాక ఆచార వ్యవహారలను సన్మార్గములో అర్ధంచేసుకుని ఆచరణలోనికి తెచ్చే సంస్కారాలను, దైవీస్థాయికి చెందిన మానసిక & అధ్యాత్మిక ప్రగతి అను విషయాలను “అందరికీ అతి సులువైన భాషలో అందించారు.